నల్లకుంట : తెలంగాణ రాష్ట్ర రెండవ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ ని తెలంగాణ “బీసీ దళ్” రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీల అభివృద్ధికి మన సమస్యలపై చర్చించడం జరిగింది. బీసీల అభివృద్ధి కొరకు తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ కృష్ణ మోహన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మరియు, బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సుందర్ కల్లూరి, రాజీవ్, కేశవ, అర్జున్, సతీష్, రమణ,సాగర్ తదితరులు పాల్గొన్నారు