- నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష.
- 1200 ల మంది అమరవీరుల బలిదానాల త్యాగఫలం.
- 60 యేండ్లు నాటి కల సాకారం అయిన రోజు
- బరిగిసి కొట్లాడి విముక్తి పొందిన రోజు
- నీళ్లు, నిధులు నియామకాల నినాదం ఫలించిన రోజు
తెలంగాణ : ఈరోజు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి గారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం అయిన రోజు ఈ రోజు, 60 ఏళ్లు వివక్షకు గురైన తెలంగాణ ప్రజలు, భరిగిసి కొట్లాడి సొంత రాష్ట్రం సాధించుకుని విముక్తి పొందిన రోజు అని గుర్తుచేసుకున్నారు…
నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో ఉవ్వెత్తున ఎగసి కేంద్రం మెడలు వంచి, దేశంలోనే 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఈ రోజుతో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ కల సాకారం అయ్యి ఏడేళ్లు పూర్తయ్యాయని, ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని కుమారస్వామి గుర్తుచేసుకున్నారు.

అంబేద్కర్ గారు చెప్పినట్లు రాజ్యాధికారం అందుకోలేని జాతులు అంతరిస్తాయి అన్నట్లు అది అక్షరాల కొన్ని కులాలు దేశంలో అంతరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయాని. దాని కోసం మరియు బీసీలు రాజకీయ శక్తిగా నిర్మించడానికి ,ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి కోసం మరొక ఉద్యమం చేయాల్సిన సందర్భం వస్తుందని తెలుపుతూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి గారు..