బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి గారి పిలుపు మేరకు బీసీ దళ్ ఆధ్వర్యంలో పరకాల మండలంలో హరితహారం కార్యక్రమం ఘనంగా చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు జునుమల వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు తమ వంతు బాధ్యతగా ఇంట్లో మొక్కలు నాటి ప్రగతికి బాటలు వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై 24% శాతం అడవులను 50% చేరుకునే విధంగా కృషి చేయాలి అని పర్యావరణ కాలుష్య నివారణకు దోహదపడాలని,పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి అని తెలియజేశాడు .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరకాల మండల్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు జునుమల వెంకటేష్ ,చేనాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుడు ,కార్యదర్శి కోశాధికారి,కమిటీ సభ్యులు మారియు పరకాల మండల్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షుడు కోశాధికారి కార్యదర్శి సలహదారుడు కమిటీ సభ్యులు డాక్టర్ ఎమ్మార్ రెడ్డి కాలేజి యాజమాన్యం విద్యార్థులు పాల్గొనడం జరిగింది.