ఈ రోజు బీసీ దళ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలొ కొండాపూర్ లొ గ్రేటర్ హైదరాబాద్ నూతన కమిటీ వంద మంది యువ బిసి నాయకులతో ఏర్పడడం జరిగినది ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నియమితమైన తురజ బాల రాజేష్.

ఈ సందర్భంగా బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి , ప్రమాణ పత్రం ఇవ్వడం జరిగింది .
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల లొ చైతన్యం, తీసుకురావడానికి ,బీసీల సంక్షేమం కొరకు, బీసీల హక్కులు రిజర్వేషన్లపై పోరాటం చేయడానికి బిసీ బతుకులు మార్చుకుందామని బీసీ దళాలను తయారు చేస్తానని చెప్పిన వెంటనే వేదిక ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేశారు.
స్వాతంత్య్రం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలు దాటినా బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా,సాంఘికంగా వెనుకబడి ఉండటం బాధాకరం. ఈ రోజు గ్రామాలలో, పల్లెల్లో చూసినట్లయితే బీసీలు సాంఘికంగా వెనుకబడి ఉన్నారు, ఎంతో దుర్భరమైన జీవితాలను గడుపుతూ అత్యంత హీనంగా భిక్షాటన చేస్తూ కూడా బ్రతుకుతున్నారు కొన్ని కులాలు చాలా బాధలు అనుభవిస్తూ ఉండడం చాలా బాధాకరం అని తెలియజేశారు.
స్వాతంత్య్రం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో సమాంతరంగా సామాజిక న్యాయం కోసం సామాజిక గౌరవం కోసం పోరాడిన డాక్టర్ అంబేద్కర్ ని గుర్తు చేస్తూ దళితులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి నాడు .అదే నినాదాన్ని బీసీలు గ్రహించి ఉద్యమించాలని తెలియజేశారు.
ఈ రోజు జాతీయ స్థాయిలో 2500 బిసి కులాలు ఉంటే 2400 చట్టసభల్లో మెట్లు ఎక్కకపోవడం చాలా బాధాకరమని తెలియజేశారు. ఇంకా వెనుకబడి ఉండడం చాలా బాధకరమైన విషయమని తెలియజేశారు.
బీసీల జీవితాల్లో చీకటి చీల్చుకుంటూ వెలుగులు రావాలి అంటే బీసీలలో చైతన్యం రావాలని బీసీలు ఐక్యం కావాలని అన్ని రంగాల్లో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందాలి అని అంతేకాకుండా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగిన బీసీ హక్కులు కాలరాసిన పరాభవం ఎదురైనా బీసీదల్ మీ వెంటే ఉంటుందని తెలియజేశారు.. తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు బిసి బలిదానాలు ,బీసీలు త్యాగాల గురించి మరియు పోరాట తత్వం గురించి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం అని తెలియజేశారు. జనాభా ప్రకారం బీసీలు రిజర్వేషన్లు 52% పెంచాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలి.

బీసీలు ఓటు అనే అస్త్రాన్ని ఉపయోగించి బీసీలకు రాజ్యాధికారం వైపు నడిపించాలి అని బీసీల ఐక్యత బలం చాటాల్సిన సందర్భం ఏర్పడ్డదని తెలియజేశాడు. బీసీల లొల్లి గల్లీ నుండి ఢిల్లీ వరకు వెళ్లాలి అని మన హక్కులను మనం పోరాడి సాధించుకోవాలి అని బీసీ జాతి అభివృద్ధి బీసీ సంక్షేమం బిసి హక్కుల కోసం బీసీల రిజర్వేషన్ల కోసం అలుపెరుగని సైనికుల్లాగా ఉద్యమం చేద్దామని సుభాష్ చంద్రబోస్ ను గుర్తు చేస్తూ మీరు రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్య్రాన్ని ఇస్తాను అన్నట్లుగా మీరు బీసీ సైనికుల నివ్వండి నేను చట్టసభల్లో రిజర్వేషన్లు ఇస్తానని తెలియజేశారు.కుదిరితే పరిగెత్తి ఉద్యమం చేద్దాం లేకుంటే నడుస్తున ఉద్యమం చేద్దాం ఉద్యమానికి ఊపిరి పోసే సందర్భం ఏర్పడ్డదని తెలియజేశారు.
ఈ సృష్టిలో చలనం ఉన్నా ఏదీ ఆగదని పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు ,అస్తమించే చంద్రుడు అలాగే ఈ ఈ బీసీ ఉద్యమం కూడా ఆ ఆగలేదు,ఆపలేరు అని తెలియజేశారు.
రాజకీయ అధికారం వస్తే అన్నీ వస్తాయి అందుకే రాజకీయ అధికారం సాధించే దిశలోనే దృష్టి పెట్టాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న , మేడ్చల్ జిల్లా కార్యదర్శి వెంకటయ్య ,బిసీదల్ రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్, కె పి హెచ్ బి డివిజన్ వార్డు మెంబర్ రమణ, కె పి హెచ్ బి యాదవ సంఘం ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు , కనకయ్య, వెంకటరమణ మరియు బిసి బంధుమిత్రులు పాల్గొన్నారు