తెలంగాణ రాష్ట్రం లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న దృశ్య ఈ రొజు బీసీ దల్ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనియొక్క ముఖ్య ఉద్దేశ్యం బీసీలకు రాజకీయ అవకాశాలు గురించి ప్రక్షాళన చేయడం .
బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ బీసీలకు ఇచ్చింది బిక్షం కాదు బీసీలు కోరింది మన వాటా,
బీసీ హక్కుల కోసం డిమాండ్ కోసం నిరంతర కృషి పట్టుదల దీక్షా అంకితభావంతో పోరాడాలి .బీసీల సంక్షేమం ధ్యేయంగా పోరాటాలు చేసి దళిత బహుజనూలు పాలిట ఆపద్బాంధవుడు గా వెలిసి పేదలకు పెన్నిధిగా ఉండాలి.
దేశానికి శక్తిగా ఉన్న బీసీ యువత ప్రజాస్వామ్యంలో కీలకంగా నిలిచే మన ఓటు హక్కులు తప్పనిసరిగా బిసి జాతికి వినియోగించుకోవాలి అని చైతన్యం తీసుకురావాలి.
బీసీలు ఐక్యతా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలి .ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న బరిలో ఉన్న మన అభ్యర్థులకు మన సహకారం అందించాలి. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలి.
బీసీల అభ్యున్నతి, చైతన్యం ఐక్యమత్యం, రిజర్వేషన్లు హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయం ,సామాజిక ఆర్థిక ప్రజాస్వామిక సమానత్వం కోసం పోరాటం చేయాల్సిన సందర్భం ఏర్పడ్డదని అన్నారు.
అన్ని పార్టీలు మేనిఫెస్టో లో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయాలి .బీసీ ఆశావాదులు mlaగా పోటీ చేయడానికి వచ్చిన అభ్యర్థుల జాబితా తయారు చేసి ,బిసి ఆత్మగౌరవ రాజకీయ బస్సు యాత్ర చేపడతాం .
బీసీల తరఫున ప్రతి నియోజకవర్గంలో ఓటు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం .
నియోజకవర్గంలో బీసీల ఆత్మగౌరవ పేరున సభలు ఏర్పాటు చేసి ,ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నా వారికి బీసీ దళ్ మద్దతుతో పోటీ లో ఉంటారు.
బిసి సమరానికి సిద్ధం కావాల్సిన ప్రతి బీసీ నాయకుడు శక్తిగా మారాలని ప్రతి బీసీకి ఓటు వేయాలని పిలుపు నివ్వాలి.
బీసీ దల్ కార్యకర్తలు
బీసీ దళ్ సిద్ధాంతాలకు అనుగుణంగా శ్రమించాలి.
బీసీ దళ్ ప్రజాక్షేత్రంలో వెల్లడానికి సంసిద్ధం కావాలని బీసిలలొఐక్యత అవగాహన తీసుకురావాలి.
పతి బహుజన ఇంటి తట్టి ఓటు అనే అస్త్రాన్ని బీసీలకు వాడాలని తెలియజేయాలి.
ప్రతి నియోజకవర్గానికి బీసీ దళ్ ప్రచారానికి వస్తుంది అని మీ తరఫున ప్రచారం కొనసాగిస్తుంది.
ఓటు అనేది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనకిచ్చిన పెద్దవరం ,రాష్ట్ర వ్యాప్తంగా బలహీనవర్గాల ఆత్మగౌరవ సామాజిక న్యాయం మీద పోరాటం చేయాలని తెలియజేశారు .అంతేకాకుండా అన్ని నియోజకవర్గాల్లో బిసిల ఆత్మగౌరవ పేరున సభలు ఏర్పాటు చేసి ,బిసి ఆశావాదులు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చిన అభ్యర్థుల జాబితా తయారు చేసి,వారికి బీసీ దల్ ల మద్దతు ప్రకటిస్తుందని, ప్రతి నియోజకవర్గంలో ఓటు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, బీసీ ఆత్మగౌరవ రాజకీయ బస్సు యాత్ర కూడా చేపడతామని తెలియజేశాడు .
ఈ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తురగా బాల రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది ,ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లపోతు భగవాన దాస్ , మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోట శ్రీనివాస్ రావు , ప్రధాన కార్యదర్శి వెంకటయ్య ,రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్ ,కూకట్పల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ వినయ్ ,మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు సోము వెంకటేశ్వరరావు, రమణ , స్టేట్ కమిటీ మెంబర్ కనకయ్య ,వి వెంకట రమణ , సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ ముచ్చర్ల గణేష్, ప్రశాంత్, శ్రావణ్ మిగతా కీలక కార్యకర్తలు పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమంలో భాగంగా బిసి దళ్ యూత్ అధ్యక్షులుగా కొండాపూర్ అంజయ్యనగర్, సిద్ధిక్ నగర్ కు నియమించడం జరిగింది.