రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలంలో , భారతీయ జనతా పార్టీ బీదర్ పార్లమెంట్ సభ్యులు (MP) శ్రీ భగవత్ ఖుబ ని బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ లో భాగంగా దెబ్బతిన్న బీసీ కుల వృత్తుల సమస్యలు, పీజీ మెడికల్ ఎంట్రెన్స్ రిజర్వేషన్ మొదలైన బీసీ సమస్యలపై దీర్ఘంగా చర్చించడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన MP బీసీల సాధికారతకు ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం భోజనం తదుపరి,చర్చల అనంతరం ఎంపీ గారికి సన్మానించి , బీసీ దల్ బుక్లెట్ జ్ఞపికగా అందజేయడం జరిగినది.
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...
Read more