తిరుమల బాలాజీ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం ప్రత్యేక సేవలు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ,తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రత్యేక సేవలు ఆచరించారు. శుక్రవారం నాడు ఉదయం 3 గంటలకు పూరాభిషేకం, ఉదయం 7:30 గంటలకు బిగినింగ్ బ్రేక్ దర్శనం సేవలలో ,కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు .ఆయనకు అనంతరం ఆలయంలోని రంగనాయక మండపం లో శేష వస్త్రం కప్పి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. అర్చక స్వాములు వేద ఆశీర్వచనం ఇచ్చారు.ప్రత్యేక సేవల అనంతరం ఆయన ఆలయం వెలుపల పాత్రికేయులతో కాసేపు మాట్లాడారు.స్వామి వారి అభిషేక సేవలో పాల్గొనడం తన జీవితంలో గొప్ప అనుభూతిగా మిగులుతుంది అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more