శిల్పారామం మాదాపూర్ లో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు ఎంతో సందడి సందడి సాగుతున్నాయి. చేనేత చీరలకి మంచి స్పందన వస్తుంది. బతుకమ్మ ఆటను శిల్పారామం మహిళా సిబ్బంది వచ్చిన సందర్శకులు కూడా ఆడుతున్నారు. ఈరోజు నుండి దాండియా ఆటను ఏర్పాటు చేయడం జరిగింది. గుజరాతి స్టాల్ల్స్ వారు మరియు వచ్చిన సందర్శకులు కూడా పాల్గొన్నారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కందుల కూచిపూడి నాట్యాలయం గురువు జి. రవి శిష్య బృందం చే “దేవి వైభవం”కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. పార్వతి, లక్ష్మి సరస్వతి అమ్మవారులు కలిసి ఆదిశక్తి అమ్మవారి జననం నుండి మహిషాసుర మర్దిని సంహరించే కథను నృత్య రూపకంగా ప్రదర్శించారు. దాదాపుగా 100మంది కళాకారులు పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more