బాసర టెంపుల్ పుణ్యక్షేత్రం ప్రపంచప్రఖ్యాతి గాంచిన రెండవ అతిపెద్ద సరస్వతి దేవి దేవాలయము. దక్షిణ భారత దేశం లోనే అతిపెద్దదిగా పేరు గాంచిన ఈ దేవాలయం లో సరస్వతీ మాత మహాలక్ష్మి, దుర్గామాత సమేతంగా కొలువై వున్నారు.
అక్షరాభ్యాసం ప్రక్రియ బాసర లో ఎంతో పేరుగాంచింది. చిన్న పిల్లలను విద్యాలయం లో చేర్చేముందు బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తారు. తెలుగు వారే కాకుండా దేశం నలుమూలలనుండి మొదటి అక్షరాన్ని తమపిల్లల చేత వ్రాయించడనికి ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇచట అక్షరాభ్యాసం చేయిస్తే చదువులో బాగా రాణిస్తారని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఎందుకు ప్రజలు అలా నమ్ముతారో తెలుసు కోవాలంటే బాసర లో అమ్మవారు ఎలా వెలిసారో తెలుసుకోవాలి.
బాసర టెంపుల్ చరిత్ర ( Basara temple History )
ఇచట కొలువై వున్న అమ్మవారు సాక్షాత్తు మహాభారతాన్ని రచించిన వేదవ్యాసమహర్షి చేత ప్రతిష్ఠింప చేయబడింది. అమ్మ వారి అణుగ్రహం తోనే వ్యాసమహర్షి మహాభారత కావ్యరచన ఇచటినుండే ప్రారంభించి దిగ్విజయంగా పూర్తిచేస్తాడు.
మొదట అమ్మవారు స్వయంభూ గా వెలసిందని ఆ తర్వాత కొన్ని సవత్సరాలకు అమ్మవారు తన మహిమను తెలియజెప్పేందుకు అద్రుష్యమయ్యారని ప్రతీతి.
ఆ తర్వాత వేద వ్యాసుడు కురుక్షేత్ర యుద్ఢం పూర్తయిన తర్వాత తన పుత్రుడు శకునితో కలిసి ఇక్కడకు వచ్చాడు. అప్పుడు తాను ఈ ప్రాంతం లోని ప్రశాంత వాతావరణం తన తపస్సుకు అణువైన ప్రదేశంగా భావించి మనశ్శాంతి గురించి తపస్సు చేయనారంభించారు. అప్పుడు వ్యాసమహర్శి కి సరస్వతి మాత కలలో కనిపించి ముగురమ్మలకు విగ్రహ ప్రతిష్ట చేయవలసిందిగా ఆజ్ఞాపించారని చరిత్ర చెబుతోంది.
వ్యాస మహర్షి గోదావరి నదీ తీరాన భక్తిశ్రద్ధలతో స్నానమాచరించి మూడు దోసిల్లతో ఇసుకను తెచ్చి అమ్మవార్ల విగ్రహాలను నిర్మించి ప్రతిష్టించారు. అప్పటినుడి ప్రతీరోజు తాను ఆ విగ్రహారాధన గావిస్తూ మహా భారతాన్ని వ్రాయడనికి శ్రీకారం చుట్టాడు.
మొదట వ్యాసుడు సంచరించిన ప్రాంతం గా ఈ ప్రదేశం వ్యాసపురి గా పిలువబడేది. ఆ పేరు క్రమంగా వాసర గా మరియూ సరిహద్దుల్లో నున్న మహారాష్ట్ర భాషా ఫ్రభావం చేత చివరికి బాసర గా పిలువబడుతుంది.
బాసర లో చూడదగిన ప్రదేశాలు
దత్తాత్రేయ స్వామి మందిరం:
ఆలయానికి తూర్పు దిశగా మేడిచెట్టు నీడలో దత్తాత్రేయ స్వామి మందిరం గలదు. ఇచట దత్తాత్రేయ స్వామి పాలరాతి విగ్రహం, పాదుకలు గలవు.
కాళికామాత ఆలయం:
మెట్లమార్గం లో పైకి వెళ్తే గుడి కి పడమర దిక్కున కాళికామాత ఆలయం గలదు. ప్రతినిత్యం అర్చన పూజాదులచే విరాజిల్లుతుంది.
వ్యాసమహర్షి ఆలయం:
ఆలయానికి దక్షిణ దిశలో వెళ్తే వ్యాస మహర్షి గుడి ఉంది. అందులో వ్యాసమహర్షి విగ్రహం, లింగం దర్శనమిస్తాయి.
వేద శిల:
బాసర బస్టాండు కు దగ్గర్లో గల ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇచట గల అతిపెద్ద మహిమాన్వితమైన శిల అందరినీ ఆకర్శిస్తుంది. ఈ శిలను ఒక చిన్న రాయి తో కొద్దిగా కొడితే ఆ శిల నుండి కంచు మ్రోగినట్లు సుధీర్గమైన శబ్దం వినిపిస్తుంది. ఇందులో అమ్మవారి నగలు ఉన్నాయని ప్రశస్తి. అందుకే దీన్ని “వేద శిల” గా చెప్పుకుంటారు.
గుహ:
మందిరానికి సమీపంలో ఒక గుహ గలదు. ఇది నరహరి మాలూకుడు తపస్సు చెసిన స్థలంగా ప్రఖ్యాతి గాంచింది.
బాసర కి ఎలా చేరుకోవాలి? (How to go Basara)
Basara Temple distance
హైదరాబాద్ నుండి బాసర కు ఎలా వెళ్ళాలి? (Basara from Hyderabad)
బాసర హైదరాబాద్ కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి బస్సు మరియూ రైలు మార్గాల్లో చేరుకోవచ్చు.
విజయవాడ నుండి బాసర కు ఎలా వెళ్ళాలి? ( Basara from vijayawada)
బాసర విజయవాడ కు సుమారు 480 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ నుండి బస్సు మరియూ రైలు మార్గాల్లో చేరుకోవచ్చు.
గుంటూరు నుండి బాసర కు ఎలా వెళ్ళాలి? ( guntur from vijayawada)
బాసర గుంటూరు కు సుమారు 510 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరు నుండి బస్సు మరియూ రైలు మార్గాల్లో చేరుకోవచ్చు.
బాసర టెంపుల్ లొకేషన్ మ్యాప్ (Basra Temple Location Map)
చిరునామా – Basara temple Address
Sri Gnana Saraswathi Devasthanam
Basara Mandal, Nirmal District
Telangana, 504101, india
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం
మం. బాసర, జిల్లా.నిర్మల్
తెలంగాణా రాష్ట్రం, 504101, ఇండియా
ఫోన్ నంబర్ Basara temple Phone number
+91 08752 255503
9491000656
ఎక్జిక్యుటివ్ ఆఫీసర్ Executive officer number
+91 08752 255550: EO
ఆసిస్టెంట్ ఎక్జిక్యుటివ్ ఆఫీసర్ Assistant Executive officer number
+91 08752 255550
బాసర టెంపుల్ టైమింగ్స్: (Basara Temple Timings)
దర్శనం:
ఉదయం 5 గం. నుండి మధ్యాహ్నం 1 గం. వరకు
మధ్యాహ్నం 2 గం. నుండి రాత్రి 7.30 గం. వరకు
(* పండగలు, ఇతర ప్రత్యేక రోజులలో ఈ సమయాలు మారవచ్చు)
ఫ్రారంభ సమయం: ఉ. 3:30
మంగళ వాయిద్యాలు: ఉ. 3:30 నుండి 4:00 వరకు
ఆభిషేకం: ఉ. 4:00 నుండి 5:00 వరకు
ఆలంకరణ: ఉ. 5:00 నుండి 6:00 వరకు
మహా హరతి: ఉ. 6:00 నుండి 6:30 వరకు
ఆక్షరాభ్యాసం: ఉ. 7:30 నుండి ప్రారంభం
కుంకుమార్చన: ఉ. 7:30 నుండి ప్రారంభం
సర్వ దర్శనం: ఉ. 7:30 నుండి నుండి మ. 12:30 వరకు
మహా హారతి, నైవేద్యం: మ. 12:30 నుండి 1:00 వరకు
మూసివేత: మ. 1:00 – మ. 2:00 వరకు
తిరిగి తెరుచుకొనే సమయం: మ. 2:00
ఆక్షరాభ్యాసం: మ. 2:00 సా: – 6:00 వరకు
మహా హారతి: సా. 7:30
మూసివేత: సా. 8:30