కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో నీ 132 జీడిమెట్ల డివిజన్ పరిధలోని రుక్మిణీ ఎస్టేట్స్ లోని నూతన డ్రైనేజీ లైన్స్ పనులు జరుగుతున్నందున, కాలనీ వాసులు మరో 30 మీటర్స్ కూడా వేస్తే వారికి ఇంకా ఎటువంటి సమస్య ఉండదు అని 132 డివిజన్ కార్పొరేటర్ తార చంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే కార్పొరేటర్ గారు మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డికి అదేశించగా, భరత్ సింహరెడ్డి కాలనీకి వెళ్లి వాటిని స్వయంగా జరుగుతున్న పనులు పరిశీలించి, ప్రజలతో చర్చించి, సంబధిత అధికారులతో మాట్లాడి, సమస్యను వివరించి, కాలనీ వాసులకు సమస్య పరిష్కారం చేస్తాం అని భరత్ సింహరెడ్డి భరోసా ఇచ్చారు..