- చిల్కనగర్ డివిజన్ వ్యాక్సిన్ కేంద్రాన్ని పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల గీత
చిల్కనగర్: చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ చిల్కనగర్ డివిజన్ లోని మండల ప్రజా పరిషత్ స్కూల్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా
బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయమన్న అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి గారికి డీసీ అరుణ కుమారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

రామంతపూర్ లో ఏర్పాటుచేసిన వ్యాక్సిన్ కేంద్రం చాలా దూరం ఉందని, అడ్రస్ దొరకక చిల్కనగర్ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే చిల్కనగర్ లో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారికి మరియు డిసి అరుణ కుమారి గారికి అభ్యర్థన చేసిన, వెంటనే చిల్కానగర్ లో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ జోనల్ కమిషనర్ రవీందర్ రెడ్డి గారికి మరియు బిసి అరుణ కుమారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసి అరుణ్ కుమార్ గారు ,EE నాగేందర్ ,AE రాజ్ కుమార్, Dr ప్రియాంక మరియు టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, కొండల్రెడ్డి,ఈరెలి రవీందర్ రెడ్డి,మాస శేఖర్, కౌకొండ జగన్ బింగి శ్రీనివాస్,సుందర్ రవీందర్ గౌడ్, శ్రీకాంత్, శ్యామ్ సాయినాజ్ బేగం మొదలగు వారు పాల్గొన్నారు