గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. మరి కాసేపట్లో అరుదైన ఘనత సాధించనున్నారు బండ్ల శిరీష.

చరిత్రాత్మక ఘట్టానికి సమయం ఆసన్నమైంది.
తొలిసారి తెలుగు అమ్మాయి రోదసిలోకి ప్రవేశించబోతున్నారు. మరికొద్ది గంటల్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది, తొలిసారిగా శిరీష అంతరిక్షంలోకి ప్రవేశించబోతున్నారు.

ఈ యాత్ర విజయవంతమైతే భారత్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కనున్నారు. శిరీషకు ముందు రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ రోదసిలోకి వెళ్లి వచ్చారు.