గురువారం ఎన్ టి ఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను తెలంగాణా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గా నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు బక్కిని నరసింహను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సందర్బంగా సనత్ నగర్ నియోజకవర్గం నుండి గ్రేటర్ హైదరాబాద్ ముదిరాజ్ మహాసభ యువత అధ్యక్షులు పలారంబండి మధు ముదిరాజ్ ఆద్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో ఎన్టీఆర్ భవన్ లోని ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more