ఆ కోర్టు వివాదాలే కారణమా?.
చెన్నారం : తెలంగాణ రాష్ట్ర, వరంగల్ రూరల్ జిల్లా, నర్సంపేట్ మండలం, గురజాల గ్రామానికి చెందిన నీలం మల్లయ్య (రిటైర్డ్ ఆర్ ఐ) తన పై పట్టపగలే బండారి సూర్యప్రకాష్ కారు తో వెంబడించి తన ఇంటి ముందుకు వచ్చి తిట్టి, బెదిరించి,దాడి చేశాడు అని మల్లయ్య ఆరోపిస్తున్నారు.ఇక విషయంలోకి వెలితే. వరంగల్ రూరల్, చెన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో, తేదీ 11/08/2021 రోజున పట్ట పగలు సమయం 3 గంటల 50 నిముషాలకు నీలం మల్లయ్య, నర్సంపేట నుండి గురజాల గ్రామంకు వెళ్ళే దారిలో, స్థానిక స్కూల్ సమీపములో బండారి వెంకటేశ్వర్లు తో మాట్లాడి బండి మీద వెళుతుండగా గురజాల గ్రామం నివాసి అయినటువంటి బండారి సూర్యప్రకాష్, నీలం మల్లయ్యను ఎర్ర రంగు కారు తో వెంబడించి, అక్కడి నుండి మల్లయ్యను వెంబడించిన సూర్యప్రకాష్, మల్లయ్య ఇంటి ముందర అసభ్యకరమైన భూతులు తిడుతూ, బెదిరించాడని మల్లయ్య ఆరోపిస్తున్నాడు. దీనికి గల ప్రధాన కారణం..తన కూతురు మెయింటెనెన్స్ కేసు వెనక్కి తీసుకోవాలని తెలియచేశాడు.
ఈ విషయాన్ని అదే రోజున స్థానిక చెన్నారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, పోలీసులు వెంటనే స్పందించి తన అర్జిని తీసుకొని, ప్రాథమిక విచారణకు ఆదేశించి, తదుపరి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తానని స్థానిక ఎస్సై మరియు నెక్కొండ సిఐ హామీ ఇచ్చారని మల్లయ్య తెలియజేశాడు. పోలీసులు వెంటనే స్పందించినందుకు హర్షం వ్యక్తం చేశాడు. వెంటనే శుక్రవారం 13-08-2021 రోజున ఎస్ఐ గారు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక దర్యాప్తు చేయడం జరిగింది. పోలీసులు వేగవంతంగా చర్యలు తీసుకున్నారని సంతోషం వ్యక్తపరిచాడు. స్థానిక ఎస్సై బండారి సూర్యప్రకాష్ కి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఎమ్మార్వో దగ్గరికి బైండోవర్ కోసం వెళ్లడం జరిగిందని,ఆ తదుపరి తిట్టి కొడతానని బెదిరించి వెంబడించినందుకు గానూ కోర్టు అనుమతి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తానని చెప్పాడు అని తెలియజేశారు