తొలిపలుకు న్యూస్ (మహబూబ్ నగర్ జిల్లా): బాలానగర్ పి.ఎస్. పరిధిలోని ముగ్గురు యువకులు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నామని స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి విషయమై బాలానగర్ ఎస్.ఐ. యువకుల నుండి తగిన సమాచారం తీసుకుని, జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ IT కోర్ అధికారులకు తెలిపారు. IT కోర్ బృందం వారు కొంతకాలంగా నిఘా ఉంచి, మొబైల్ ఫోన్ల వివరాలు సేకరించి, ఇట్టి సమాచారాన్ని బాలానగర్ ఎస్.ఐ. కి తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారి యువకులను స్థానిక పోలీస్ స్టేషన్ కు పిలిపించి, వారి మొబైల్ ఫోన్లను అప్పగించగా, యువకులు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more