**
బాల నగర్ కు చెందిన చిత్రాదేవి అనే మహిళ సూర్య నగర్ లో నివాసం ఉంటూ చిట్టీల నెపంతో , అందరితో నమ్మకంగా ఉంటూ చిట్టీ డబ్బులు వసూలు చేసి పారిపోయిన ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, కల్యాణి అనే బాధితురాలికి అనేక మాయ మాటలు చెప్పి రెండు లక్షల చిట్టీలు , 5 లక్షల చిట్టీలు వేయించుకుంది మరియు మరికొందరు ఇతరుల దగ్గర కూడా ఆమె దగ్గర చిట్టిలు కట్టించుకుంది. కాగా చిత్రాదేవి గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెల్లి అందరిని మోసం చేసిన ఘటన చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు బాలానగర్ సిఐ వహీద్ ఉద్దీన్ కి ఫిర్యాదు చేయగా కేసు పూర్వపరాలు తెలుసుకుని వెంటనే స్పందించి నిందితురాలిపై కేసు నమోదు చేసి ఎఫైఆర్ చేయడం జరిగింది. అంతే కాకుండా నిందితురాలిని త్వరగా పట్టుకొని కోర్టులో హాజరు పరిచి బాదితురాలికి తగు న్యాయం జరిగేటట్టు చూస్తానని ఆమెలో మనోధైర్యాన్ని నింపి పంపించినట్టు తెలుస్తుంది. కాగా బాధిత మహిళ తనకు పోలీసు వ్యవస్థ పట్ల మరింత నమ్మకం కలిగేలా సిఐ గారు తక్షణమే స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేస్తూ ఇలాంటి పోలీసులు ఉండడం వల్లనే మా లాంటి బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేసింది.