బాహుబలి2
తెలుగోడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబలి. రెండు పార్ట్ లుగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామి సృష్టించింది. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. చైనాలో పెద్ద ఎత్తున బాహుబలి సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా, డిసెంబర్ 29న జపాన్ లో బాహుబలి 2 చిత్రం విడుదల కాబోతుంది.
ఇక రష్యాలోను బాహుబలి2ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు నిర్మాత శోభు యార్లగడ్డ. 2018 జనవరిలో రష్యన్ భాషలో ఈ మూవీ విడుదల కానుంది. అయితే కొద్ది సేపటి క్రితం రష్యన్ భాషకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఇది ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. మీరు ఆ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.