- ఆరోగ్య శ్రీకి తోడైన ఆయుష్మాన్ భారత్
- అందుబాటులోకి మరిన్ని చికిత్సలు
- నేషనల్ హెల్త్ అథారిటీతో అవగాహన ఒప్పందం
- ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ కార్యదర్శి
- ఎలాంటి ప్రీమియమూ చెల్లించనవసరం లేదు
- దేశంలో ఎక్కడైనా వైద్యం పొందేందుకు అవకాశం
ఆర్టీపీసీఆర్ పాజిటీవ్ వస్తే ఆయుష్మాన్ వర్తింపు
- తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంఓయూ…
కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ ( ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎం వో యు కుదుర్చుకున్నది.
తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది.
ఆయుష్మాన్ భారత్ నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
ఈమేరకు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ ఎ ఎం రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవో కు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.