వలిగొండ: తెలంగాణ రాష్ట్ర, యదాద్రి జిల్లా , వలిగొండ మండలంలో మంగళవారం రాత్రి బీరు సీసాలతో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మంగళవారం రాత్రి నాగారం గ్రామానికి చెందిన సయ్యద్ అహ్మద్ అనే అతను ఎయిర్ పోర్ట్ లో పని చేసి, పనిముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ రాత్రి 7 గంటల సమయంలో వలిగొండ నుండి లోతుకుంట రోడ్డుపై వెళ్తుండగా, దుండగులు 15 మంది బీరు సీసాలతో దాడి చేసి గాయపరిచారు. అటుగా వెళ్తున్న స్థానికుడు చూసి అరవడంతో, దుండగులు అటునుంచి పరారయ్యారు.
ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడటంతో బాధితున్ని చికిత్స నిమిత్తం రామన్నపేట ప్రబుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.