**తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ హాజరు
శ్రీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిమ్స్ ఆసుపత్రిలో బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ ఆధ్వర్యంలో బోనాలు పండుగ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు,జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి,
పాల్గొన్నారు.
దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణలో బోనాల పండుగ విశిష్టతను ప్రజలకు వివరించారు. తెలంగాణ పండుగలలో బోనాలు అతి ముఖ్యమైనవని.. తెలంగాణ సంసృతి గురించి తెలియజేసే పండుగ ఇదని అన్నారు. జంట నగరాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో ఉండాలని.. మంచి ఆరోగ్యంతో జీవించాలని కోరుకున్నానని తెలిపారు. ముఖ్యంగా అమ్మవారిని కోరుతోంది.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు మార్చాలని అన్నారు బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. మోదీ గారి మనసు మారి.. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, జనాభా గణన లో కుల గణన జరగాలి అని కోరుకున్నానని నల్ల పోచమ్మ ఆలయ సమక్షంలో దుండ్ర కుమారస్వామి చెప్పారు. బీసీలకు న్యాయం చేయాలని.. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించాలని కోరినట్లు దుండ్ర కుమారస్వామి చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ లో బోనాలు అంటేనే సాంస్కృతికంగా ఎంతో ప్రత్యేకత కలిగినదని అన్నారు. అమ్మవారులంతా కొలువై ఉన్న ఈ నగరంలో.. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుంటూ శతాబ్దాలుగా బోనాలను నిర్వహిస్తూ ఉన్నారని తెలిపారు. నిమ్స్ లో శ్రీమతి పద్మ గారి ఆధ్వర్యంలో ఘనంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పద్మ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారని.. ప్రతి ఒక్కరూ నల్ల పోచమ్మ అమ్మవారి దీవెనలను తీసుకోవాలన్నారు వకుళాభరణం కృష్ణమోహన్ రావు. మహిళల చైతన్యం కోసం పద్మ గారు చేపట్టిన కార్యక్రమాలను కూడా వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రశంసించారు. మనకు చాలా పండుగలు ఉంటాయి.. ఏ పండుగైనా ఇంట్లో కొత్త దుస్తులు ధరించి, పిండి వంటలు చేసుకుంటూ.. మనం మాత్రమే బాగుండాలని కోరుకుంటూ ఉంటాం.. కానీ బోనాలు మాత్రం అందరూ బాగుండాలని కోరుకునే విశిష్టమైన కార్యక్రమం అని అన్నారు. ప్రజలు అంటురోగాల బారిన పడకుండా అమ్మవారు కాపాడుతారని వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. పట్టణాల్లో అయినా.. పల్లెల్లో అయినా.. అమ్మవారులను కొలిచి కష్టాలను పారద్రోలాలని ప్రజలు కోరుకుంటూ ఉంటారని అన్నారు. నిమ్స్ లో ఉద్యోగినిగా ఉంటూనే.. పద్మ గారు తలపెట్టిన బోనాల కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తూ ఉన్నారని వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు.
శ్రీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ నల్లపోచమ్మ ఎంతో మహిమగల అమ్మవారని.. కష్టాలు చెప్పుకుంటే తీరుస్తారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో చాలా మంది జీవితాల్లో మార్పులు వచ్చాయని పద్మ తెలిపారు.
ఈ కార్యక్రమానికి నిమ్స్ హాస్పిటల్ కు చెందిన నిమ్స్ రిజిస్టర్ రాజ్ కుమార్, శ్రీ మహిళా సంక్షేమ సంఘ ట్రెజరర్ దివ్య, తెలంగాణ గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ నరసింహ గౌడ్, ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, జీహెచ్ఎంసి ప్రెసిడెంట్ అమర్నాథ్ గౌడ్, నాయకులు.. రవీందర్ గౌడ్, ఆనంద్ గౌడ్, సత్యం గౌడ్ శ్రీధర్ గౌడ్.. తదితరులు పాల్గొన్నారు.