కొంపల్లి, మైసమ్మగూడ లోని మల్లా రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ , యూజీసీ అటానమస్ నందు, ఈసీఈ విభాగంలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ మడుపు గారికి “డిజైన్ అండ్ అనాలసిస్ ఆఫ్ కెపాసిటివ్ ప్రెజర్ సెన్సార్ స్ట్రక్చర్స్ టు ఎన్హాన్స్ ది సెన్సిటివిటీ ఫర్ ది బయోమెడికల్ అప్లికేషన్స్ ” అనే అంశంపై పరిశోధన చేసినందుకు గీతం విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ( పిహెచ్‌డి ) ని ప్రదానం చేసింది.వీరు, జెఎన్‌టియు,హైదరాబాద్ నుండి బి.టెక్, ఎం.టెక్ చేసి, ఉపాధ్యాయ వృత్తిలో 13 సంవత్సరాల అనుభవం కలిగి ఉండి, ఇప్పటి వరకు 6 పేటెంట్లు మరియు వివిధ అంశాలపై జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో పలు పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. డాక్టరేట్ పొందిన అరుణ్ కుమార్ మడుపు గారిని కళాశాల యాజమాన్యం తో పాటు డైరెక్టర్ డా.వి.ఎస్.కె.రెడ్డి, ప్రిన్సిపాల్ డా. ఎస్. శ్రీనివాసరావు గారు మరియు అతని సహచరులు, ఎంత సన్నిహితులు చారి మరియు డి. సదానందం ఆయనను అభినందించారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more