వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందించేందుకు కృషి చేస్తా సమాచార పౌర సంబంధాల శాఖ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఏవీ న్యూస్ CMD బొమ్మ అమరేందర్ ను నియమిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ సందర్భంగ బొమ్మ అమరేందర్ మాట్లాడుతూ. మేడ్చల్ జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందించేందుకు తనవంతు కృషి చేస్తానని, పేర్కొన్నారు, మేడ్చల్ జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరూ అక్రిడేషన్ కార్డు కొరకు తాము విధులు నిర్వహించే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యల నుండి పేర్ల జాబితా దరఖాస్తుల కాపీలు తేదీ 04_ 06 _ 2022 _ లోపు,మేడ్చల్ జిల్లా డిపిఆర్ఓ అందజేసి అక్రిడేషన్ కార్డులకు అర్హత పొందవలసిందిగా ఆయన పేర్కొన్నారు.. స్వతంత్ర వర్గానికి చెందిన జర్నలిస్టులు నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ,జిల్లా స్థాయి అక్రిడేషన్ కార్డుల పేర్లను జిల్లా సంబంధిత డిపిఆర్ఓ కు పంపాల్సిందిగా పేర్కొన్నారు మరిన్ని వివరాలకు వెబ్సైట్ను..http//ipr.Telangana.gov.in nu సందర్శించి. ఆన్లైన్ ద్వారా అక్కడేషన్ కార్డు కొరకు దరఖాస్తులు సమర్పించాల్సిందిగా కోరారు… అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన బొమ్మ, అమరేందర్ ను, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, బాలకృష్ణ నాగేంద్రబాబు, లతో పాటు మేడ్చల్ జిల్లాలోని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ అభినందనలు తెలిపారు
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more