పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా, ఇటీవల భారీ వర్షానికి ఇల్లు కూలి నిరాశ్రయులైన జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన మావురం మొగిలి కుటుంబాన్ని, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి పరామర్శించి, 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
వారితో పాటు టీఆర్ఎస్ నాయకులు గడ్డమీది శ్రీనివాస్ ,మధ్యల నరేష్, వోడ్నల సురేష్, మావురం స్వామి స్థానిక యువత తదితరులు ఉన్నారు.