• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

పంజాబ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వీఐపీలకు భద్రత తొలగింపు

AdminbyAdmin
29/05/2022
inNews
0

చండీగఢ్‌: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వీఐపీ సంస్కృతికి తెరదించేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.ఇందులో భాగంగా ఆ మధ్య మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను రద్దు చేసిన భగవంత్‌ మాన్‌ సర్కారు.. తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మతపెద్దలకు కూడా భద్రతను తొలగించింది.రిటైర్డ్‌ పోలీసు అధికారులు, మత పెద్దలు, రాజకీయ నేతలు ఇలా 424 మందికి కేటాయించిన పోలీసు భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. డేరా రాధ సోమీ బ్యాస్‌కు ఉన్న 10 మంది భద్రతను కూడా తొలగించినట్లు తెలిపింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో 184 మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు మాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీతో పాటు మాజీ మంత్రులు మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌, రాజ్‌ కుమార్‌ వెర్కా, భరత్ భూషణ్‌ అషు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నిర్ణయంతో 400 మందికి పైగా పోలీసు సిబ్బంది తిరిగి పోలీసు స్టేషన్లకు వచ్చినట్లు సీఎం మాన్‌ అన్నారు. పోలీసులు సామాన్య ప్రజల కోసం పని చేయాలి గానీ.. వీఐపీలకు భద్రతా విధుల పేరుతో వారిని బాధపెట్టకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మాన్‌ వెల్లడించారు.
అంతకుముందు, మాజీ ఎమ్మెల్యేల పింఛను విషయంలోనూ మాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యులుగా ఎన్నిసార్లు ఎన్నికైనా.. ఇకపై ఒకేఒక్క పదవీకాలానికి ప్రభుత్వం పింఛను అందజేస్తుందని ప్రకటించారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఒకసారి శాసనసభ్యునిగా ఎన్నికైనవారికి పదవీకాలం ముగిశాక నెలకు రూ.75 వేల చొప్పున పింఛను చెల్లిస్తున్నారు. తరవాత ప్రతి పదవీకాలానికి ఈ పింఛను మొత్తంలో 66 శాతాన్ని అదనపు పింఛనుగా ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడున్నర లక్షల నుంచి అయిదున్నర లక్షల రూపాయల వరకు పింఛను తీసుకునే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈ నిర్ణయం వల్ల కోట్లాది రూపాయలు ప్రజా ప్రయోజనాలకు ఖర్చు పెట్టే అవకాశం లభిస్తుందని సీఎం మాన్‌ అన్నారు. అయితే దీనిపై రాష్ట్ర శాసనసభలో బిల్లు తీసుకురావాలని పంజాబ్‌ గవర్నర్‌.. ప్రభుత్వానికి సూచించారు.

Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News