అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
అన్ని దానాలలో కల్లా అన్నదానం ఎంతో గొప్పదని చెబుతూ ఉంటారు. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఫిబ్రవరి 4న గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు.
దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. ఈ గొప్ప కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ను అధినేత శంకర్ గౌడ్ ని అభినందిస్తూ ఉన్నామని అన్నారు. ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. అన్నమే మన శరీరంలో ప్రవేశించి ప్రాణంగా మారుతుంది.. అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమేనని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఒక ప్రాణం నిలవడానికి కావలసినది ఆహారమే.. ఆహారం లేకుండా మరణించారనే వార్తలు మానవాళికే కళంకం. అన్నదానం చేయడం శ్రేష్టమని అన్నారు దుండ్ర కుమారస్వామి.
మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా.. ఎన్ని ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.. కావాలని ఒక్క అన్నదానంలో మాత్రమే దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తి చెందుతారని దుండ్ర కుమారస్వామి తెలిపారు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు చాలా అరుదు.. ఆ లిస్టులో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఉండడం విశేషమని అన్నారు కుమారస్వామి. ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేసే దానం చాలా అత్యున్నతమైనది.. ఆకలితో ఉన్న వారికి, పేదలకు, అనాదలకు, రోగులకు, వికలాంగులకు అన్నదానం చేస్తే కచ్చితంగా మంచి ఫలితం వస్తుందని దుండ్ర కుమారస్వామి తెలిపారు.
