అందోల్ : తెలంగాణ రాష్ట్ర, మెదక్ జిల్లా, ఆందోల్ నియోజకవర్గ, పుల్కల్ మండల కేంద్రంలో మంజుశ్రీ జైపాల్ రెడ్డితో కలిసి గ్రామపంచాయతీ భవనాన్ని
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం చాల సంతోషంగా ఉందని, భవన నిర్మాణానికి తన సొంత స్థలం విరాలంగా ఇచ్చిన మన్నే నర్సింలుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెల్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లెల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెల్పారు. కరోన సమయంలో దేశం మొత్తం ఆర్థికమాంద్యంలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు నిధులు లేకపోయినా గ్రామాలకు వచ్చే నిధులను అపలేదని తెల్పారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగ, పనులు పూర్తియ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనలో కంటే కేసీఆర్ గారి ప్రభుత్వం పాలనలో పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి గత ప్రభుత్వంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండేదని, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టేవారుకదాని, టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఇంటినుండి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్ కి తరలిస్తున్నారని, తరలించిన చెత్తను వర్మీ కంపోస్ట్ గా మార్చి రైతాంగానికి అందిస్తున్నారని అన్నారు.
సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు సైడ్ డ్రైనేజ్ లు నిర్మిస్తున్నారని పల్లెప్రగతిలో భాగంగా ప్రజలు అనారోగ్యాలకు గురవకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని త్వరలో ఇల్లు లేని ప్రజలకు ఇండ్లు ఇస్తామని పుల్కల్ వాసులకు తీపి కబురు అందించారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో భేషజాలు లేకుండా పార్టీలకు అతీతంగా పథకాలను అందిస్తున్నారని ఇలాంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గా ఉండటం మన అదృష్టం అని ఆనందాన్ని వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, ఎమ్మెర్వో పరమేశ్వర్, మండల రైతు బంధు అధ్యక్షులు నర్సింహ రెడ్డి, అందోల్ ఆత్మకమిటి చైర్మన్ యాదగిరి రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు క్రిష్ణా రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ముద్దైపెట్ విజయ్, గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్ చారి, సర్పంచ్ శ్రావణ్, స్థల దాత మన్నే నర్సింలు తదితరులు పాల్గొన్నారు.