మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసినందుకు మంత్రి కె.టి.ఆర్. కు, తెలంగాణా ప్రభుత్వానికి క్రుతజ్ణతలు తెలియజేశాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేస్ ‘ఫార్ములా ఈ’ నిర్వహించడానికి హైద్రాబాద్ నగరం ఎంపిక అయింది. ఫార్ములా వన్ వలె ‘ఫార్ములా ఈ’ కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ ‘ఫార్ములా ఈ వన్’పోటీలు 2014 వ సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్‌ల అవసరం ఉండదు.మహీంద్రా రేసింగ్ కంపెనీ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది.
ఇఫ్ఫటీ వరకు ప్రపంచ ప్రఖాత నగరాల్లో ఈ పోటీలు జరిగాయి. కానీ ఇండియా లో జరగడం ఇదే మొదటి సారి. ఇంతవరకు ఇవి న్యూయార్క్, లండన్, మెక్సికో, రోమ్, బెర్లిన్, రోమ్,వాంకోవర్, సియోల్, దిరియా లలో జరిగాయి.