ఉప్పల్ : తెలంగాణ, మేడ్చల్ జిల్లా, రాచకొండ, ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఒక గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెలితే…
ఉప్పల్ రింగ్ రోడ్ లోని సికింద్రాబాద్ బస్ స్టాప్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు మీద పడిపోయి ఉన్నట్లుగా, రాచకొండలోని ఉప్పల్ పొలీస్ స్టేషన్ కి ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పగా, ఉప్పల్ ఎస్‌హెచ్‌ఓ ఆదేశాల మేరకు, హెచ్‌జి -800 బిసి-వి ఏరియా ఉప్పల్‌లో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న జానకి రాము, రవి లు ఉదయం 9 గంటలకు ఘటన స్థలానికి చేరుకున్నారు.
రోడ్డు మీద పడుకున్న వ్యక్తిని బాగా పరిశీలించి అక్కడి చుట్టుప్రక్కల వారిని విచారించగా, అతను ఉదయం 7 గంటల ప్రాంతాన మృతి చెందినట్లుగా గుర్తించారు. అతను బ్లూ జీన్స్ మరియు తెలుపు రంగు చిరిగిన చొక్కా వేసుకున్నాడు. అతను ఉప్పల్ రింగ్ రోడ్డ్ మీద అడుక్కుంటూ జీవనం కొనసాగిస్తున్న వ్యక్తి గా తేల్చారు.. అతని ఆరోగ్యరీత్యా బాలేకపోవడం మరియు తినడానికి తిండిలేక ఆకలితో చనిపోయి ఉండవచ్చని విచారణలో తెలుసుకున్నారు.