తొలిపలుకు న్యూస్ (హైదరాబాద్): బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగు రేఖ,
సామాజిక సేవ బడుగు బలహీన వర్గాలకు అండ, అనాధలకు అన్నం పెట్టే దాతగా ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి షేక్ రహ్మత్తుల్లా.
ఆయన జీవితంలో అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, సేవలను ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ,సేవా ఇష్టంతో చేసే పనులకు ప్రతిరూపంగా నిలిచారు షేక్ రహ్మతుల్లా…
ఆయన కోల్ బెల్ట్ ఏరియాలో సింగరేణి కార్మికుడి కుటుంబంలో జన్మించి అతి చిన్న వయసులో అనేక కష్టాలు పడి అంచలంచలుగా ఎదుగుతూ రాజకీయంగా అనేక ఒడిదుడుకులను ,అడ్డంకులను ఎదుర్కొంటూ ఈ రోజు ఉన్నతమైన అత్యంత స్థాయికి ఎదిగి ప్రతిష్టాత్మకమైన డే స్ప్రింగ్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా అనే సంస్థ ప్రకటించిన డాక్టరేట్ అవార్డును ఇజ్రాయిల్ అధికారిక ప్రతినిధి కేం సాగర్ మరియు మాజీ మంత్రి బోడ జనార్దన్ చేతులమీదుగా అందుకోవడం ఆయన సేవకు అది ఒక చిన్న గుర్తింపు మాత్రమే అని చెప్పోచ్చు.
ఆయన ఎప్పటినుండో జీవితంలో అనేక సేవలు చేస్తూ అనాధ పిల్లలను అన్నదాత గా, అనేక సేవా కార్యక్రమాలను బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తూ వారికి అండగా నిలవడం, విలువలతో కూడిన వ్యక్తిత్వం అయనదే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనడానికి ఆయన నిలువెత్తు నిదర్శనం షేక్ రహ్మతుల్లా.. సాయం చేయడం అంటే మనసుతో చిన్నప్పుడు తోచినంత సాయం చేయడం కాదు అని ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి దానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన.. ఆయన సేవను గుర్తించి ఈ అవార్డు రావడం పట్ల గోదావరిఖని, మరియు హైదరాబాద్ లోని అనేక మంది బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ సోదరులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కరోనా మహమ్మారి భయపెడుతున్నా, ఒక వైపు ధైర్యంగా అనేక సేవలు అందిస్తూ, మరోవైపు లాక్ డౌన్ నేపధ్యంలో సామాజికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందిస్తూ, నిరంతర సేవలు అందిచడం వీరి మానవతా దృక్పధాన్ని చెప్పకనే చెబుతుంది. ఎందరో నిరుపేదలకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేసి ఆకలి తీర్చిన సేవాతత్పరుడు డా. షేక్ రహమతుల్లా అహ్మదుల్లా . మూడో కంటికి తెలియకుండా సేవ చేయడం, రెండో చేతికి తెలియకుండా దానం చేయడం ఆయనకే చెల్లింది.
ఈ సందర్భంగా రహ్మతుల్లా మాట్లాడుతూ… ” నా సంకల్పం బలమైనది .. నా మనసు స్వచ్ఛమైనది … నిస్వార్ధమైన వ్యక్తిత్వంతో సమాజానికి సేవ చేయాలని నేను ఇప్పుడు అనుకున్నది కాదు.. నేను నా చిన్నతనం నుండి ఎదుర్కున్న చూసిన సంఘటనలు.. అనుభవాలనుండి వచ్చింది.. మనం ఈ భూమీదకు వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు.. పోయేటప్పుడు ఏమి తీసుకుపోము. ఒక్క మంచిగా బతికాడన్న పేరు మాత్రమే తీసుకెళ్తాం. అందుకే ఆ చిన్ని స్వార్ధంతోనే ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాను. నేను అందుకున్న ఈ అవార్డు ఇంకా ఎంతో మంది అనాధలకి సూర్యుడి లాగా వెలుగునిచ్చి .. ఇంకా ఎంతో మందికి అండగా నిలబడాలనే సంకల్పాన్ని పెంచుతుందని అన్నారు.
షేక్ రహ్మతుల్లా గారికి డాక్టరేట్ వచ్చిన’ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందరో అభాగ్యుల ప్రాణాలను, మరెందరో నిర్భాగ్యుల జీవితాలను కాపాడే మా షేక్ రహీముతుల్ల గారు అందుకోండి హృదయ పూర్వక శుభాభినందనలు…