ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నియామకం
ఇటీవల జరిగిన ఐఏఎస్‌ల బదిలీలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న భారతి హొళికేరిని మంచిర్యాల కలెక్టర్‌గా బదిలీ చేశారు. అమయ్‌కుమార్ బదిలీని నిలిపివేశారు. ఆయన స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా రజత్‌కుమార్ సైనీని నియమించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న శశాంకను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. వ్యవసాయశాఖ కమిషనర్‌గా రాహుల్ బొజ్జాను నియమించారు.