కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు అమిత్ షానే అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాను. కొవిడ్ ఫలితాల్లో తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉంది. కానీ డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు అమిత్ షా తెలిపారు. ఇటీవలి కాలంలో తనను సంప్రదించిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు.
బాల గంగాధర తిలక్ 100వ వర్థంతి సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన వెబినార్ ప్రారంభ సమావేశంలో అమిత్ షా శనివారం పాల్గొన్నారు. దీంతో.. ఆ సమావేశంలో పాల్గొన్న వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.