- ఫోటో, యూట్యూబ్ జర్నలిస్టులకు అండగా టీజేఎస్ఎస్-అనంచిన్ని వెంకటేశ్వరావు..
- సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఘన సన్మానం..
బాగ్ అంబర్ పెట్: ఫోటో, యూట్యూబ్ జర్నలిస్టులకు అండగా తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీజేఎస్ఎస్) అండగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరావు అన్నారు. బాగ్ అంబర్ పెట్ రామకృష్ణ నగర్ కమిటీ హాల్ లో ఘనంగా జరిగిన ‘ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు
ఈ సందర్భంగా అనంచిన్ని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఫోటో జర్నలిస్ట్, యూట్యూబ్ జర్నలిస్టులు క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇక అంచెలంచెల పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఫోటో జర్నలిస్ట్ లకు తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు ఇస్తున్నట్టు ఆరన ఈ సందర్భంగా తెలిపారు.
సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి సద్దాం,అంబర్ పేట్ నియోజకవర్గ ఇంచార్జ్ మోర రాములు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంఘసేవకుడు అంబర్ పేట్ శంకర్, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటీ రామకృష్ణ హాజరయ్యారు. అంబర్ పేట్ శంకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనానికి తనను ఆహ్వానించినందుకు టీజేఎస్ఎస్ కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిజెఎస్ఎస్ నాయకులు శ్రీధర్ యాలాల, సతీష్ ముదిరాజ్, శ్రీశైలం, హబీబ్, ప్రవీణ్ ముదిరాజ్, కార్యదర్శి మొహమ్మద్ యాసిన్, సుజాత, రమేష్ , భాను, రాజు, రాణి , సీనియర్ ఫోటోగ్రాఫర్ హమేద్, సీనియర్ద ఫోటోగ్రాఫర్ జ్ఞానేశ్వర్, రవి, జావీద్, గణేష్. టి సి పి పి డబ్ల్యూ ఎ రామంతాపూర్ అధ్యక్షులు శ్యామ్, వేణు.ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ అధ్యక్షులు గున్నమ్మా శ్రీధర్ రెడ్డి, బాబన్న రవి స్టూడియో సీనియర్ ఫోటో గ్రాఫర్ వీరేష్ గౌడ్. జేజి రాజు, చిత్తం రావు,బొల్లారం శివ కుమార్. బాబురావు (దుర్గ డిజిటల్ ) రమేష్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.