అంబర్ పేట్: తెలంగాణ రాష్ట్ర, అంబర్ పేట్ డివిజన్ బాపునగర్ కాలనీలో అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ సంబంధిత అధికారులు పర్యటించారు.
మోహిని చెర్వు నుండి వరదనీటి వలన అంబార్పేట్ నియోజక వర్గం లోని, అంబర్ పేట్ బాపునగర భాదలు” అనే కథనం తొలిపలుకు న్యూస్ లో రావడం చూసి, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించి, బాపు నగర్ లో పర్యటించారు. అక్కడి సమస్య గుర్తించి, బాపు నగర్ మోహిని చెరువు నాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సంబంధిత అదికారులను ఆదేశించారు. తమ సమస్య పట్ల ఎమ్మెల్యే స్పందించిన తీరుకు బాపునగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
తమ కాలనీ కష్టాలు, డ్రైనేజ్, వాటర్ లికేజ్ సమస్యలు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్య పారిష్కాకారానికి కారణమైన “తొలిపలుకు న్యూస్” వారికి బాపునగర్ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.