ఫ్రెంట్ లైన్ వారియర్స్ అయినటువంటి జర్నలిస్టులు కరోనా టైం లో న్యూస్ కవరేజ్ చేయడంలో తమ ప్రాణాలకు సైతం తెగించి కష్టపడుతూ కరోనా కాటుకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనాతో 10 రోజుల క్రితం సీనియర్ జర్నలిస్టు అమర్నాథ్ (70) నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కరోనాతో పోరాడి ఇప్పుడే తుదిశ్వాస వదిలారు. ఈ విషయం తెలుసుకున్న “తొలిపలుకు” చీఫ్ ఎడిటర్ దుండ్ర కుమారస్వామి సంతాపం తెలియజేస్తూ, అమర్నాథ్ గారు చాలా సీనియర్ జర్నలిస్టు, వృత్తి పరంగా వారు చాలా కష్టపడే మనస్తత్వం కలవారు, అలాంటి వారు ఇలా కరోనా మహమ్మారి కాటుకు బలైపోవడం చాలా బాధాకరం అన్నారు. ప్రతీ ఒక్క జర్నలిస్టు వాక్సిన్ వేసుకొని కరోనా బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కుమారస్వామి అమర్నాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు…
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more