వరద బాధితులకు ఆపన్న హస్తం –రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ
విపత్తులో ఎమ్మెల్యే సీతక్క కు లక్ష రూపాయలు విరాళం అందించిన – బిసి యువ నేతలు
సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి సహాయం చేయడం గొప్ప విషయం-రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా గ్రామాలలో మండలాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే, ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదలు తో ములుగు నియోజక వర్గ ప్రాంతం అతలాకుతము అయిన విషయము అందరికీ తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాల బ్రతుకులు చిద్ర మైపోయాయి, జీవాలు సైతం వరదల్లో కొట్టుకుపోయి బ్రతుకులు చీకటిమయం అయిపోయాయి, వరదల్లో పుస్తకాలు కొట్టుకుపోయి విద్యార్థుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. ఈ తరుణంలో స్థానిక ఎమ్మెల్యే సీతక్క వెను వెంటనే స్పందించి ఆయా ప్రాంతాలను పరిశీలించి బాధితులను ఆదుకోవడం కోసం ఎడతెరిపిలేని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఆవిడ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన బిసి యువసేన “రక్షక్ దళం” సభ్యులు గురువారం హైదరాబాదులో సీతక్కను కలిసి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ ఆర్ధిక సాయాన్ని విద్యార్థులకు పుస్తకాలు కొని అందించడానికి ఉపయోగిస్తామని సీతక్క హామీ ఇచ్చారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో బిసి యువసేన జాతీయ సమన్వయకర్త పెచ్చటి మురళీ రామకృష్ణా రెడ్డి తో పాటు రక్షక్ దళం సభ్యులు గుత్తుల రమణమూర్తి, గుబ్బల వెంకటరమణ, వాసంశెట్టి నాగార్జున, మద్దూరి రాజు, సాగ బాలకృష్ణ తదితరులు సీతక్కను కలిశారు.