అన్ని మతాలు సమానమే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుందాం: షేక్ రహమతుల్లా
ఎలక్షన్స్ అంటే చాలు గ్రూపు రాజకీయాలు తప్ప మరేవీ ఉండవు. కులాల వారీగా పక్కకు తీసుకుని వెళ్లడం.. మతాల వారీగా వేరు చేయడం వంటివి చేసే ఎంతో మంది చెత్త రాజకీయనాయకులను మనం చూస్తూ ఉన్నాం. ఇక తెలంగాణలో మునుగోడు చుట్టూ రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే గ్రూపు రాజకీయాలు చాలా ఎక్కువయ్యాయి. కానీ ఓ నేత మాత్రం అన్ని కులాలను, మతాలను కలుపుకుంటూ వెళుతున్నారు. భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా కోశాధికారి షేక్ రహమతుల్లా మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అందరినీ కలుపుకుని పోవాలనే నినాదంతో ఆయన విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ మతం ఎక్కువ కాదు.. తక్కువ కాదని అందరూ సమానమేనని ఆయన పిలుపునిచ్చారు.
చర్చిలో అన్ని మతాలకు చెందిన ప్రజలతో సమావేశం నిర్వహించి భారతదేశంలో పరమతసహనం గురించి తెలిసేలా చేశారు షేక్ రహమతుల్లా. హిందూ ముస్లిం క్రిస్టియన్ భాయ్ భాయ్ అంటూ నినాదాలతో చర్చిలో సమావేశం ఏర్పాటు చేయడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఏ మతానికి చెందిన వారైనా అందరూ తనకు సోదరులతో సమానమని చెప్పుకొచ్చారు షేక్ రహమతుల్లా. వెనుకబడిన కుటుంబాలు ప్రతి కులం లోనూ, మతం లోనూ ఉన్నాయని.. వారందరి అభ్యున్నతి కోసం తాను పాటుపడతానని చెప్పారు షేక్ రహమతుల్లా. అందరూ కలిసి మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. ఆయన గెలిస్తేనే మునుగోడుకు మంచి జరుగుతుందని అన్నారు షేక్ రహమతుల్లా. మునుగోడు ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్న బీసీ, మైనారిటీలను, పలు దళిత నాయకులను కలిసి షేక్ రహమతుల్లా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అప్సర్ పాషా మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్, ముజీబ్ ముజీబ్ జనరల్ సెక్రెటరీ, భరత్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ మైనారిటీ మోర్చా, ఇసాక్ రాజ్ సైదులు గజిని తదితరులు పాల్గొన్నారు
మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది నామినేషన్లు తిరస్కరించారు. మిగిలిన 83 మందిలో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తంగా ఉప ఎన్నిక బరిలో 47 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.