ఈటలరాజేందర్ ప్రెస్ మీట్.
ముందస్తు ప్రణాళికతో కట్టు కథలు అల్లారు.
ప్రజల హృదయంలో సంపాదించుకున్న గౌరవం మలినం చేసే కుట్ర చేశారు.
అంతిమ విజయం ధర్మానిదే.
సీఎం గారికి చెప్పే కోళ్ల ఫామ్ విస్తరణ పనులు మెదలు పెట్టాము.
2004 లోనే నాకు 180 ఎకరాలు ఉంది.
నా సంపాదన అంతా నా కష్టార్జితం.
వామపక్ష భావజాలంతో పెరిగిన, చిల్లర మల్లర్లకు లొంగను.
పదవి గొప్పదే కానీ నా ఆత్మగౌరవం కంటే కాదు.
నా నియోజకవర్గం లో ఎవరికన్నా హాని చేశానని నిరూపిస్తే సన్యాసం తీసుకుంటా.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్చి కక్ష పూరితంగా భూమి గుంజుకుంటే కొట్లాడిన ఆత్మ గౌరవాన్ని అమ్ముకొలేదు.
నయీం అనే వాడు చంపుతా అన్నా కూడా భయపడలేదు.
2004 నుండి 2014 వరకు వందల మందిని జైళ్లనుండి విదిపించినప్పుడు, మీటింగ్లకు డబ్బులు ఖర్చు పెడితే ఎక్కడివి అని ఎవరన్నా అడిగారా ?
ముదిరాజ్ బిడ్డను చావనైనా చస్తారు తప్ప భయపడరు.
దొర అనే పదానికి నేను వ్యతిరేకం.
నా మొత్తం చరిత్ర మీద
నా ఆస్తుల మీద సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించండి అని డిమాండ్ చేశారు.