మాదాపూర్ లో అల్ ఇండియా సారీ మేళ సందర్బంగా నిర్వహిసున సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు లయ బీట్స్ అఫ్ ఆర్ట్ స్రవంతి భాస్కర్ నేతృత్వం లో శిష్య బృందం చే కర్ణాటక గాత్ర కచేరి మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనా ఎంతగానో అలరించింది . గురువు ప్రతిభ శిష్య బృందం చే అన్నమాచార్య కీర్తనలు, రామదాసు సంకీర్తనలు, దేవి కీర్తనలు ఆలపించారు. కీ బోర్డు పై సత్యనారాయణ, మ్రిదంగం పై ఓంప్రకాష్ సహకరించారు. గురువు చంద్రశేఖర్ శిష్య బృందం చే ఝేమ్ ఝేమ్ తనను, మూషిక వాహన, అతనా జతిస్వరం, శివాష్టకం, జయము జయము లలిత కళావాహినికి, పలుకీ బంగారమయేహ్న, ఆంగికం, మొదలైన అంశాలను ఆశ్రిత, ఆధ్య, శృతి, లోహిత, ప్రజ్ఞ, అక్షయ, రిషిక, జాహ్నవి, నిత్య మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more