పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా అకున్ సబర్వాల్
పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా అకున్ సబర్వాల్ ఐపీఎస్ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ గా మొన్నటి వరకు పని చేసిన ఆయన ఈ రోజు సివిల్ సైప్లె కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. మొన్నటి వరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పని చేసిన సీవీ ఆనంద్ ఐపీఎస్ కేంద్ర సర్వీసు విధుల్లో చేరారు. సీఐఎస్‌ఎఫ్ ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు.