ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ మేరా పెహ్లా 4జీ స్మార్ట్‌ఫోన్ కార్యక్రమం కింద ఇప్పటికే సెల్‌కాన్, కార్బన్ సంస్థలతో భాగస్వామ్యమై చాలా తక్కువ ధరలకే 4జీ స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ వస్తున్నది. అందులో భాగంగానే తాజాగా ఇంటెక్స్ కంపెనీతో భాగస్వామ్యమైన ఎయిర్‌టెల్ ఆక్వా లయన్స్ ఎన్1 పేరిట మరో కొత్త 4జీ ఫోన్‌ను కేవలం రూ.1649కే అందిస్తున్నది.
అయితే ఈ ఫోన్‌కు గాను వినియోగదారులు ముందుగా రూ.3,149 డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఫోన్‌ను 18 నెలల పాటు వాడితే రూ.500, 36 నెలలు వాడితే రూ.1000 మొత్తం కలిపి రూ.1500 వెనక్కి ఇస్తారు. దీంతో ఫోన్ ధర రూ.1649 మాత్రమే అవుతుంది. ఇక ఈ ఫోన్‌తో ఎయిర్‌టెల్ రూ.169 బండిల్ ప్లాన్‌ను అందిస్తున్నది. దీని ద్వారా వినియోగదారులకు 500 ఎంబీ 4జీ డేటా, 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.