గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం
శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన గణేషుడికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. సోదర భావంతో అందరూ కలిసిమెలిసి ఉత్సవాలను జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో
గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ సాయి కృష్ణ యాదవ్ మరియు కమిటీ బృందం, జర్నలిస్టు వెంకట్ పాల్గొన్నారు