హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. అన్ని స్థానాల్లోనూ ఎస్‌ఎఫ్‌ఐ ప్యానల్‌పై ఏబీవీపీ జయకేతనం ఎగురవేసింది.
విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఆర్తి నాగ్‌పాల్, ఉపాధ్యక్షుడిగా అమిత్‌కుమార్, జనరల్ సెక్రటరీగా ధీరజ్ సంగిజి, జాయింట్ సెక్రటరీగా ప్రవీణ్‌కుమార్ గెలుపొందారు. కల్చరల్ సెక్రటరీగా అరవింద్ ఎస్ కుమార్, స్పోర్ట్స్ సెక్రటరీగా నిఖిల్ రాన్ ఎన్నికయ్యారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఏబీవీపీ కార్యకర్తలు విజయోత్సవ సంబురాలు నిర్వహించారు.