కేజ్రివాల్ అంటే అప్పట్లో దేశంలోనే ఒక సంచలనం. సరికొత్త ఫంథాలో రాజకీయాల్లోకి వచ్చి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మొన్ననే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపి తన పార్టీ సత్తా ఎమిటో దేశానికి తెలియజేశారు. వారు పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ లోనూ ఈ సంవత్సరం చివర్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. వాటిపై ఇంతకుముందునుంచే దృష్టి కేంద్రీకరించిన ఆం ఆద్మీ పార్టీ ఇప్పుడు సౌత్‌లో తన సత్తా చాటడానికి సమాయత్తమవుతోంది.
తెలంగాణాలో కూడా ఆం ఆద్మీ బౄందం పాదయాత్ర చేయాలనియోచిస్తోన్నాయి.రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ ల మద్దతు తమకు ఎక్కువగా ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.
ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ దీని గురించి ఏర్పాటవబోతుందనీ, 119 నియోజకవర్గాల్లో వారు పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆప్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా సోమనాథ్ భారతిని ఇదివరకే నియమించారు.