రివ్యూ: అ!!
తారాగణం: కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి తదితరులు
సంగీతం: మార్క్ కె. రాబిన్
నిర్మాత: నాని, ప్రశాంత్ తిపినేని
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
అ!!కు ప్రధాన బలం తారాగణం. నాని నిర్మాతగా ఉండటం వల్లనో లేక ప్రశాంత్ కథ చెప్పిన విధానం నచ్చిందో కానీ ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడానికి హీరోయిన్ల కలయికే. ఒకరి మీదే ఫోకస్ అయిన సినిమా కానప్పటికీ కాజల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బా ఒక కాన్సెప్ట్ కాంబో కోసం కలవడం చాలా మంచి పరిణామం. ఎవరు బాగా చేశారు, చేయలేదు అనే ప్రస్తావన అనవసరం. ఇది పాత్రల సమ్మేళనం తప్ప నటీనటులది కాదు. చూస్తున్నంత సేపు వాటితో ప్రయాణం చేస్తున్నాం అన్న ఫీలింగ్ కలగటం వల్ల వాళ్ళు ఇంతకు ముందు ఎలాంటి సినిమాలు చేశారు అనే సంగతి కూడా కాసేపు మర్చిపోతాం. నలుగురు హీరోయిన్లు ఉన్నా అలా అనిపించకుండా కేవలం అక్కడ పాత్రలు మాత్రమే కనిపించడం విశేషం. అందరు సమానంగా స్పేస్ దక్కించుకున్నారు కాబట్టి ఎవరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే అవసరం కలగదు. ఉన్నంతలో నిత్య మీనన్, ఈశా రెబ్బ తక్కువ కనిపిస్తారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకప్ చేసిన పాయింట్ చాలా కొత్తది. అందులో అనుమానం లేదు. చాలా అరుదుగా ఇలాంటి ప్రయోగాలు జరుగుతాయి. ఒక సమస్యని కొత్త స్టైల్ లో ప్రెజెంట్ చేయాలనుకున్న ప్రశాంత్ తపన మెచ్చదగిందే. కాని అది చెప్పే క్రమంలో కాస్త నెమ్మదించడంతో రెగ్యులర్ ఆడియన్స్ కి స్క్రీన్ మీద ఏం జరుగుతుందో అర్థం కాదు. ఒక్కో పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన తీరు మాత్రం చాలా బాగుంది. కాని అన్ని పాత్రలను ఒక దాని తర్వాత ఒకటి పారలల్ గా చూపించే ప్రయత్నం చేయటంతో కొంత గందరగోళం నెలకుంటుంది. కాని చివరిలో తాను ఏం చెప్పాలనుకున్నది మాత్రం 2 నిమషాల్లో అద్భుతంగా ఆవిష్కరించాడు ప్రశాంత్ వర్మ.మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ని కొంత వరకు మెప్పించినా కామన్ మ్యాన్ కు మాత్రం అ!! ఒక పజిల్ లాగే అనిపిస్తుంది. ఇలాంటి తరహా స్క్రీన్ ప్లే గతంలో వర్మ, చంద్రశేఖర్ యేలేటి లాంటి దర్శకులు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ప్రశాంత్ వర్మ కూడా అదే రూట్ లో వెళ్తూ మోడరన్ జెనరేషన్ ని లక్ష్యంగా చేసుకున్నాడు కనక మేకింగ్ లో ఆ తేడా గమనించవచ్చు. కాని పూర్తి నిరాశ పరచని ఒక యంగ్ టాలెంట్ మాత్రం టాలీవుడ్ కి పరిచయం అయ్యిందని చెప్పొచ్చు.
రివ్యూ: అ!!
రేటింగ్: 2.5/5
తారాగణం: కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి తదితరులు