దేవి నవరాత్రి వేడుకలకు విజయ్ దేవరకొండకు ఆహ్వానం
నవరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించే దుర్గా పూజలు, దసరా వేడుకలకు హాజరు కావాలని కోరుతూ బర్కత్పుర ప్రాంతానికి చెందిన ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ విజయ్ మోహన్, స్మిత దంపతులు ప్రముఖ సినీనటుడు విజయ్ దేవరకొండను జూబ్లీహీల్స్ లోని ఆయన నివాసం వద్ద కలిసి ఆహ్వానించారు. ప్రతి ఏటా దేవి నవరాత్రి ఉత్సవాలను బర్కత్పురలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు.
