• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Spirituality

సంకటనాశన గణేశ స్తోత్రం – ఆపదలను తొలగించి సకల కోరికలను నెరవేరుస్తుంది.

AdminbyAdmin
26/01/2022
inSpirituality
0
గణేశ స్తోత్రం తెలుగు

సంకటనాశన గణేశ స్తోత్రం అత్యంత ప్రాముఖ్యత గల స్తోత్రం.ఇది ప్రతిరోజు పఠించిన వారికి సకల సంపదలు కల్గి, అన్ని కోరికలు తీరుతాయని పురాణాల్లో చెప్పబడింది. వినాయకున్ని అనేక పేర్లతో పిలుస్తారు. గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాథుడు, పిల్లైయార్ ఇవన్నీ వినాయకుని పేర్లే. వినాయకున్ని విఘ్నాలు రాకుండా కాపాడే దేవునిగా కొలుస్తారు. అందుకే విఘ్నేశ్వరుడని పేరు వచ్చింది. బుద్ధి, విజ్ణానాన్ని ప్రసదించే దేవునిగా ప్రసిద్ధి. ఏ పూజ ప్రారంభించినా మొదట గణేశున్ని పూజించడం ఆనవాయితీ.

సంకటనాశన గణేశస్తోత్రం నారదపురాణంలోనిది. నారదపురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. ఈ పురాణంలో 25,000 శ్లోకాలు కలవు. ఈస్తోత్రం నారదునిచే చెప్పబడినది.

గణేశస్తోత్రం:

నారద ఉవాచ –

ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,

భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.

ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,

తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,

సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,

ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.

ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,

న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !

విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,

పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,

సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,

తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః

ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్

సంకటనాశన గణేశ స్తోత్రం తెలుగు భావం:

నారదుడు ఈ విధంగా పలికెను: ఆయుస్సు పెరగాలని ఐశ్వర్యం కలగాలని, కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యం పార్వతీ పుత్రుడైన వినాయకునికి శిరస్సువంచి ప్రణమిల్లవలెను.

మొదట: వంకర తిరిగిన తొండము కలవానిగా, రెండు- ఒకే దంతము కలవానిగా, మూడు: నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవానిగా, నాలుగు- ఏనుగు ముఖం కలవానిగా, గణేశున్ని భావింపుము.

ఐదు: పెద్ద పొట్ట కలవానిగాను, ఆరు- శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించు వానిగా, ఏడు: విఘ్నములను తొలగించువానిగా, ఎనిమిది: పొగవంటి తెల్లని శరీర కాంతి కలవానిగా వినాయకున్ని భావించవలెను.

తొమ్మిది: బాలచంద్రరేఖ నుదుటన కలవానిగా, పది- విశిష్టమైన నాయకునిగా, పదకొండు: ప్రథమ గణములకు అధిపథిగా,

పన్నెండు: ఏనుగు ముఖము కలవానిగా వినాయకున్ని భావింపుము.

ఈ పన్నెండు నామాలను ఎవరైతే ప్రాత: కాలము, మధ్యాహ్నము మరియూ సంధ్యా కాలములలో చదువుతారో వారికి విఘ్నభయముండదు. వారు కోరినది సిద్ధించును. విద్యను కోరిన వారికి విద్యయు, ధనమును కోరిన వారికి ధనము లభించును.

సంకటనాశన గణేశ స్తోత్రం పఠిస్తే ఆరునెలలలో ఫలితం లభించును. సంవత్సరం పఠిస్తే కోరికలు నెరవేరును అనడం లో సందేహం లేదు.

ఈ స్తోత్రం వ్రాసి ఎనిమిదిమంది బ్రాహ్మణులకు సమర్పించినచో, గణేశుని అనుగ్రహము వలన అట్టివారికి అన్ని విద్యలు కలుగును. విజ్ణాన వంతులగుదురు.

శివ తాండవ స్తోత్రం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags: Telugu stotrasతెలుగు స్తోత్రాలు
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News