ఉప్పల్ : తెలంగాణ రాష్ట్రం 7 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ కార్యదర్శి వాసునూరి సన్నీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా నా తెలంగాణ కోటి రతనాల వీణ నీళ్ళు నిధులు నియామకాలు నినాదంతో ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ సాక్షిగా, అసువులు బాసిన అమరవీరుల స్పూర్తితో వీర వనితల పోరాట పటిమను గుర్తుతెచ్చుకుంటూ, మన తెలంగాణ కోసం పాటు పడదాం బంగారు తెలంగాణ కాదు బతుకు తెలంగాణ సాధించుకుందాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లబోయిన మహేందర్ యాదవ్, బోడుప్పల్ టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు రామోల శ్రవణ్ కుమార్, సాయి, టిల్లు తదితరులు పాల్గొన్నారు..
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more