కర్నూల్ జిల్లా : భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను, పోలీసుల కవాతు (రిహార్సల్స్) ను జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ పరిశీలించారు
ఆదివారం జరగబోయే 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సంధర్బంగా కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయం పేరడ్ మైదానంలో సిధ్ధంగా ఉంచిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను, సివిల్, ట్రాఫిక్, ఎఆర్, హోంగార్డు సిబ్బందితో పాటు, స్కౌట్ విద్యార్దులు చేసిన కవాతును పరిశీలన వాహనం పై నుండి జిల్లా ఎస్పీ గారు శుక్రవారం పరిశీలించారు. పరేడ్ అనంతరం శకటాల ప్రదర్శనలో భాగంగా ఫాల్కన్ వాహనం, దిశా మిని బస్సు, దిశా పెట్రోలింగ్ ద్విచక్రవాహనాలను పరిశీలించారు.
ఈ పరేడ్ రిహార్సల్స్ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ, ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషా, దిశ పోలీస్ స్టేషన్ సి ఐ విక్రమ్ సింహ, ఆర్ ఐలు వి. ఎస్.రమణ, సుధాకర్, సురేంద్రారెడ్డి, వెంకటేశ్వరరావు , ఆర్ ఎస్సైలు పాల్గొన్నారు.