బోడుప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గ, బోడుప్పల్ లోని హనుమాన్ నగర్ వెస్ట్ లోని రేసిడేన్సియల వెల్ఫేర్ అసోసియేషన్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేసుకున్నారు. వేడుకలో కాలనీ వాసులు అందరూ పాల్గొనడంతో పండగ వాతావరణం కనిపించింది. కాలనీ ప్రెసిడెంట్ మధు జెండా ఆవిష్కరణ చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరు నామీద నమ్మకం పెట్టి నన్ను ఎన్నుకునందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. మా కాలనీ సమస్యలు ఇప్పటివరకు కల్సి కట్టుగా తీర్చుకున్నాము, మునుముందు ఇలాగే అందరం కలసికట్టుగా కాలనీ సమస్యలు తిరడానికి కృషి చేద్దాం అన్నారు. ఇప్పటికె సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నం, కాలనీకి కావాల్సిన అర్చి ఒక్కటి ఏర్పాటు చేసుకోవాలని చేప్పారు.