ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపైన మంత్రిమండలి చర్చించి నిర్ణయాలు తీసుకున్నది.
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులకు 50శాతం సీట్లను కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ప్రతి నెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ లను విధిగా ఆహ్వానించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.